భారీగా బెల్లం ఊటలు ధ్వంసం
సోంపేట: ఆంధ్ర – ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో శనివారం దాడులు నిర్వహించి 10 వేల లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్లు సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి.రమణ తెలిపారు. ఒడిశా పోలీసులతో కలిసి ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లోని నాటుసారా తయారు చేసే గ్రామాల్లో శ్రీకాకుళం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామచంద్రకుమార్, ఎన్‌పోర్స్‌మెంట్ సూపరింటెండెంట్లు మురళీధర్, శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో విస్తృత దాడులు చేపట్టారు. గంజాం జిల్లాలోని గంగాపూర్ గ్రామంలో 4,500 లీటర్ల బెల్లం ఊటలు, రాంచంద్రాపూర్ గ్రామంలో 5,500 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశామన్నారు. దాడుల్లో ఎస్‌ఐ జగన్నాథ్, ఎకై ్సజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


