ప్రమాదాలకు షార్ట్‌కట్!
శ్రీకాకుళం క్రైమ్ :
రెండంటే రెండు నిమిషాలు.. కాస్త ముందుకెళ్లి సరైన దారిలో ప్రయాణం సాగిస్తే ఏ ప్రమా దమూ జరగదు.. ఇంటి దగ్గర మనల్నే నమ్ముకున్న కుటుంబం ఉందని ఆ క్షణాన గుర్తుకొస్తే బతికి బట్ట కట్టినట్లే.. అయితే చాలా మంది ‘మనకేం కాదులే..’ అనే నిర్లక్ష్యంతో దగ్గర దారి(షార్ట్‌కట్ రూట్)లో ప్రయాణిస్తున్నారు. రెప్పపాటులో ప్రమాదానికి గురై విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.
పదే పదే అదే నిర్లక్ష్యం..
జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కొందరు వాహనచోదకులు నిర్లక్ష్యం వీడటం లేదు. రహదారి నిబంధనలు ఉల్లఘించిన వారిపై ఓ వైపు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా ఏమాత్రం వారిలో బెదురూ, బెణుకూ ఉండటం లేదు. మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తున్నారు. సర్వీసు రోడ్లనుంచి హైవే దాటి అవతలి రోడ్డు వైపు దాటేందుకు అనధికార షార్ట్‌కట్ యూటర్న్‌లను ఆశ్రయిస్తున్నారు.
మారని తీరు
పోలీసులు ఎంత నిలువరిస్తున్నా కొందరు భారీ వాహనదారులు అలసత్వం వీడటం లేదు. సర్వీసురోడ్లు, హైవేలపై గంటల తరబడి వాహనాలు నిలిపేస్తున్నారు. ఈ జాఢ్యం హరిశ్చంద్రపురం నుంచి మడపాం వరకు ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మడపాం టోల్‌ప్లాజా వద్ద నేషన ల్ హైవే అథారిటీ అధికారులు అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నవారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. షాపుల ముందే కాంక్రీట్ దిమ్మలు, తారుతో ఉన్న మెటల్, చిప్స్ కుప్పలు వరుసగా వేసేశారు. అయినప్పటికీ భారీ వాహనదారులు గంటల తరబడి రోడ్డు మధ్యలోనే వాహనాలు నిలిపివేస్తున్నారు.
ప్రమాదాలకు షార్ట్‌కట్!
ప్రమాదాలకు షార్ట్‌కట్!
ప్రమాదాలకు షార్ట్‌కట్!


