మెరుగైన ఫలితాల సాధనకే 100 రోజుల ప్రణాళిక
పొందూరు: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తర గతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవికుమార్ అన్నారు. మండలంలోని తోలాపి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం 8.30 గంటలకు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. వంద రోజుల పాటు అన్ని సబ్జెక్టులకు ప్రత్యేక తరగతుల నిర్వహణతో పాటు వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల ప్రణాళిక అమలు చేయని పాఠశాలలో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడితో పాటు హెచ్‌ఎంలపైనా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. తోలాపి పాఠశాలలో గణిత సబ్జెక్టు ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు బోధనను రెండు పీరియడ్‌ల పాటు పరిశీలించిన డీఈఓ బోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు.
‘వీఈఆర్ ప్రాజెక్టులు
వేగవంతం చేయాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)లో భాగంగా జిల్లాకు ప్రతిపాదించిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నవి, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలు తెలుసుకున్నారు. ఏ ప్రాజెక్టులు ఎంత ప్రతిపాదిత పెట్టుబడితో వచ్చేందుకు అంగీకారం తెలుపుతున్నారు, వాటి వల్ల చేకూరే ఉపాధి కల్పన అవకాశాలు వాటిని పరిశీలించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్, టెక్కలి, శ్రీకాకుళం ఆర్డీఓలు కృష్ణమూర్తి నాయుడు సాయి ప్రత్యూష, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీ ప్రసన్న, పరిశ్రమలు, రహదారులు భవ నాలు, అగ్రికల్చర్, హార్టికల్చర్ పశుసంవర్ధక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ ,బోర్డ్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన ఫలితాల సాధనకే 100 రోజుల ప్రణాళిక


