ట్రావెల్ బస్సులో రూ.69 లక్షల చోరీ
పూసపాటిరేగ: మండలంలోని చోడమ్మ అగ్రహారం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.69 లక్షలు పోయినట్లు శ్రీకాకుళంలోని గుజరాతి పేటకు చెందిన జామి చంద్రశేఖరరావు ,వి.వినోద్ బాబు తెలియజేశారు. బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం శ్రీకాకుళం నుంచి విజయవాడకు రెండు బ్యాగుల్లో రూ.కోటి 29లక్షలతో బస్సు ఎక్కారు. మార్గమధ్యంలో పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం సమీపంలో గల హోటల్ వద్ద భోజన విరామం కోసం బస్సును నిలుపుదలచేశారు. బాధితుల్లో ఒకరు బస్సులో భోజనం చేయగా, మరొకరు హోటల్‌కు వెళ్లారు. ఇంతలో గుర్తు తెలియని దుండగులు ఒకబ్యాగు పట్టుకుని పరుగులు పెట్టినట్లు బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులు వెంటనే పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై దుర్గాప్రసాద్ రంగప్రవేశం చేసి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.


