● తుఫాన్ సాయం.. మానవత్వం మాయం
ఇక్కడ పాడైపోయి కనిపిస్తున్నవి కూరగాయలే కాదు మన వ్యవస్థలు కూడా. ఇవి తుఫాన్ బాధితుల కడుపు నింపాల్సిన పదార్థాలు. తుఫాన్ ముంచెత్తినప్పుడు నిరుపేద మత్స్యకారులు ఖాళీ కడుపుతో ఉండకూడదని కేటాయించిన కూరగాయలు ఇలా రోడ్డుపక్కన మొలకెత్తి కనిపిస్తూ వ్యవస్థలను వెక్కిరిస్తున్నాయి. మోంథా తుఫాన్ సందర్భంగా సంతబొమ్మాళి మండలం భావనపాడులో మత్స్యకారులకు పంపిణీ చేయకుండా 40 రోజుల పాటు ఉంచేసిన తుఫాన్ సరుకులు గురువారం ఇలా ఎవరికీ చెందకుండా పారబోశారు. ‘మోంథా సరుకులు మొలకెత్తాయి’ అనే శీర్షికన సాక్షిలో ఇదివరకు ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆ ఫొటోలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ రేషన్ డీలర్‌కు చీవాట్లు పెట్టారు. సమాధానం చెప్పలేక సంబంధిత రేషన్ డీలర్ చివరకు కుళ్లిపోయిన బంగాళాదుంపలు, ఉల్లిపాయలు రోడ్డు పక్కన పెంటమీద పారవేశారు.
– సంతబొమ్మాళి


