ధాన్యం సేకరణ, ఎరువులకు కంట్రోల్ రూమ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ధాన్యం సేకరణ, ఎరువులకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121863788కు ఫోన్ చేసి తెలియజేయవచ్చునని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు
కొత్త మొబైల్ ఫోన్లు
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు 3385 కొత్త శాంసంగ్ మొబైల్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాదిన్నర కాలంగా అంగన్‌వాడీలు పాత మొబైల్‌ఫోన్‌ల తో నానా అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అంగన్‌వాడీలు పాత ఫోన్‌లను కొద్ది నెలల కిందటే ఐసీడీఎస్ కార్యాలయానికి అప్పగించి యాప్‌లలో ఆన్‌లైన్ విధానంలో ఆయా పథకాలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియను నిలుపుదల చేశారు. పాత ఫోన్‌లు పనిచేయడం లేదని, కొత్త ఫోన్‌లు ఇస్తే తప్ప ఆన్‌లైన్‌లో యాప్‌ల వివరాలు నమోదు చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులకు అంగన్‌వాడీలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జిల్లాలోని 16 ప్రాజెక్టుల పరిధిలో 130 సూపర్‌వైజర్‌లు ఉండగా వారి పరిధిలోని 3,385 కొత్త మొబైల్ ఫోన్‌లను అంగన్‌వాడీలకు అందజేయనున్నారు.
14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు
అరసవల్లి: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇంధన పొదుపు ఆవశ్యకతను వినియోగదారులకు మ రింత తెలిసేలా అవగాహన కల్పించేలా ఈ వా రోత్సవాలను జరుపుతున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి, పలాస డివిజన్ కేంద్రాల్లో వి ద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నట్లుగా, అలాగే విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 20న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు.
ధాన్యం సేకరణ, ఎరువులకు కంట్రోల్ రూమ్
ధాన్యం సేకరణ, ఎరువులకు కంట్రోల్ రూమ్


