ఈ తూతూ మంత్రం! | - | Sakshi
Sakshi News home page

ఈ తూతూ మంత్రం!

Dec 5 2025 6:54 AM | Updated on Dec 5 2025 6:54 AM

ఈ తూతూ మంత్రం!

ఈ తూతూ మంత్రం!

రైతన్నా మీకోసమే

తుస్సుమన్న ‘రైతన్నా మీకోసం’

నామమాత్రంగా జరిపి చేతులు దులుపుకున్న ప్రభుత్వం

కాగితాలకే పరిమితమైన క్లస్టర్‌ వారీ ఇంటరాక్షన్‌

మొక్కుబడిగా సమావేశాలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

రైతులకు సరిగా విత్తనాలు ఇవ్వలేదు. యూరియా కనీసం సరఫరా చేయలేదు. బ్లాక్‌ మార్కెట్‌లో రైతులు కొనుగోలు చేసేలా కృత్రిమ కొరత సృష్టించారు. బస్తా యూరియా కోసం రైతులు గొడవలు పడ్డారు. చాలీచాలని ఎరువులతో అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు చేతులేత్తేశారు. ఇందులో కూడా టీడీపీ నాయకులు చేతివాటం ప్రదర్శించారు. రైతులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ సిబ్బందే కలెక్టరేట్‌ ఎదుట నిరసనకు దిగారు. అంతే కాదు వాయుగుండం ఎఫెక్ట్‌తో నష్టపోయిన పంటను గుర్తించలేదు. మోంథా తుఫాన్‌ బీభత్సానికి జరిగిన నష్టాన్ని ఆంక్షలు, నిబంధనల పేరుతో లెక్కించలేదు.. ఇన్ని వైఫల్యాలు వెక్కిరిస్తుంటే.. ప్రభుత్వం ‘రైతన్నా మీకోసం’ అంటూ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ రైతు వద్దకు వెళ్తే నిలదీస్తారనుకున్నారేమో అధికార పక్ష నేతలే కార్యక్రమాన్ని తుస్సుమనిపించేశారు. రైతా సేవా కేంద్రాల్లో ప్రతి సారి జరిగే సమావేశాలనే రైతన్నా మీకోసం సమావేశంగా మార్చేసి మమ అనిపించేశారు.

రైతులు బిజీగా ఉన్న వేళ..

రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం నానా అవస్థలు పడ్డారు. అల్పపీడనాలు, వాయుగుండం, తుఫాన్‌లతో పంటకోసే దశలో, చేతికొచ్చిన సమయంలో నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకుంటుందేమో అని ఎదురు చూశారు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోలేదని ముందే అంచనాల నుంచి తీసేశారు. మిగతా కొంత నష్టపోయినట్టుగా గుర్తించినా ఇంతవరకు పరిహారం అందించకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. అన్నదాత సుఖీభవ సాయం కూడా కొందరికే పరిమితం చేశారు. రకరకాల కొర్రీలతో ఇవ్వకపోవడంతో రైతులు మండి పడుతున్నారు. పోనీ, చేతికొచ్చిన పంటైనా సకాలంలో కొనుగోలు చేస్తుందా? అంటే అదీ లేదు. దీంతో ప్రభుత్వం తీరుతో రైతులు చిర్రెత్తిపోతున్నారు. పాలకులు దగ్గరకొస్తే నిలదీద్దామని, నిర్లక్ష్యాన్ని కడిగే పారేద్దామని చూశా రు. కానీ, కూటమి ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించింది. కోతల దశలో, పంట అమ్ముకునే సమయంలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించింది. రైతులు బిజీగా ఉంటారని, పెద్దగా ప్రతిఘటన ఉండదని, పెద్దగా రారని, సమయం చూసు కుని కార్యక్రమాన్ని మొక్కుబడిగా పెట్టింది. దీంతో రైతన్నా మీకోసం కార్యక్రమానికి రైతులే కరువయ్యారు. దీంతో అందుబాటులో ఉన్న అనుకూల రైతులతో కార్యక్రమాన్ని కానిచ్చేశారు. అది కూడా అధికారుల నియంత్రణలో ఉండే రైతు సేవా కేంద్రాల్లో నిత్యం జరిగే సమావేశాన్ని రైతన్నా మీకోసం సమావేశంగా మార్చేసి మమ అనిపించేశారు. అధికార పార్టీ నేతలే సీరియస్‌గా తీసుకోలేదు.

నవంబర్‌ 27

డిసెంబర్‌ 2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement