మొరాయిస్తున్న యాప్
సారవకోట: ఈ ఏడాది ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్రమైన గందరగోళానికి గురవుతున్నారు. ధాన్యంను రైతులు కళ్లాల నుంచి రైస్ మిల్లులకు వాహనాలతో తీసుకురాడానికి ట్రక్ షీట్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించి మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు సరిగా పనిచేయక పోవడంతో వాహనాలతో మిల్లుల దగ్గరకి తీసుకొచ్చిన రైతులు చాలా సేపు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఆయా మిల్లులు దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. అదీకాక ప్రభుత్వం 80 కిలోల ధాన్యం బస్తాకు రూ.1895 ధర నిర్ణయించగా మిల్లర్లు వారికి నచ్చిన ధర కడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుడితి, అవలింగి, సారవకోట, బొంతు, అలుదు గ్రామాలలో రైస్ మిల్లులుండగా మిల్లర్లు వారికి నచ్చిన ధరలను నిర్ణయించడంతో పాటు రైతుల నుంచి రెండు నుంచి 4 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. బొంతు గ్రామానికి చెందిన రైతు సారవకోటలో ఉన్న ఒక మిల్లుకు ధాన్యం తీసుకెళ్లగా బస్తాకు రూ.1100 మాత్రమే చెల్లిస్తానని చెప్పడంతో అవాక్కయ్యాడు.
మొరాయిస్తున్న యాప్


