రోదన ఆగేనా..?
మార్చురీ వద్ద నిఖిల్ తండ్రి రోదన (ఫైల్)
కాశీబుగ్గ చినతిరుపతి దుర్ఘటనలో బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(12) మృతి చెందాడు. నిఖిల్ తల్లి అను ఆది వారానికి ఇంకా స్పృహలోకి రాలేదు. నిఖిల్‌కు చిన్నతనం నుంచే భక్తి ఎక్కు వ. ఆరేళ్లుగా బాలుడు కార్తీక సంకీర్తనల్లో పాల్గొంటున్నాడు. శనివారం వేకువ జామున కూడా గ్రామంలోని భక్తులందరితో కలిసి నమఃశివాయ సంకీర్తన చేశాడు. అనంతరం జింకిభద్ర గ్రామంలో ప్రైవేటుకు వెళ్లి టీచర్‌ను అడిగి వేగంగా వచ్చాడు. కానీ గుడిలో జరిగిన దుర్ఘటనలో చిక్కుకుని చనిపోయాడు. ఆలయంలోనూ ఘటనకు ముందు స్టీలు గ్రిల్ మీద బాలుడు కూర్చుని ఉండగా దిగురా అని తల్లి చెబుతూనే ఉంది. అంతలోనే తొక్కిసలాట జరగడం, బాబు పడిపోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. బాబుతో పాటు తల్లి కూడా స్పృహ తప్పి పడి పోయింది. పది నిమిషాల్లో మేలుకొని చూ సేసరికి కొద్దిగా దూరంలో బా బు పడి ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్దామని కనిపించిన వారి కాళ్లు పట్టి బతిమలాడింది. కా నీ అక్కడ ఎవరి బాధలో వారు ఉన్నారు. అక్కడే బాలుడు ఊ పిరి వదిలేశాడు. ఊరు ఇంకా బాలుడినే తలచుకుంటోంది.
–సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
పొద్దు పొడిచింది..
వాకిలి వరకు వచ్చిన వెలుగు ఆ ఇంటి చీకటిని దాటలేకపోయింది..
కంటి నిండా కన్నీరు.. ఇంటి నిండా నిశ్శబ్దం
ఏకాదశి విషాదం మిగిల్చిన ఆనవాళ్లు ఇవి..
చిన్నప్పటి నుంచి బిడ్డను మోసిన ఆ తండ్రి భుజం నేడు వాలిపోయింది..
కన్నపేగు చేతిని తడిమి తడిమి చూసిన తల్లి కడకొంగు కన్నీటితో బరువెక్కింది..
వాడు ఇక అమ్మా అని పిలవడు.. నాన్నా అని అరవడు..
దేవుడి దర్శనానికి వెళ్తే మిగిలిన చేదుకు నిదర్శనాలివి..
దేవుడిని చూసి తరిద్దామనుకున్నారు..
శ్రీవారి సేవలో మురిసిపోదామని తలిచారు..
కంటికి ఎదురుగా కన్నపేగు శవాన్ని చూడలేక తల్లడిల్లిపోయారు..
పుణ్యం కోసం వెళ్తే కలిగిన శోకమిది..
ఎందుకీ పుణ్యం ఇంత భారమైంది?
ఎందుకీ దర్శనం ఇంత దూరమైంది?
దైవం ఎదురుగా నిలబడితే.. మృత్యువు కౌగిలించుకుంది
కారణం ఏమై ఉంటుందో కాలమే చెప్పాల్సి ఉంది.
రోదన ఆగేనా..?
రోదన ఆగేనా..?


