శ్రీకాకుళం: బీసీ ఉద్యోగుల ఐక్యత.. రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు గుత్తుల వీరబ్రహ్మం, పక్కి భూషణరావు చెప్పారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో జిల్లా బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. రాష్ట్ర కమిటీ ప్రతినిధి పి.రామచంద్రరా వుఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భం వీరబ్రహ్మం మాట్లాడుతూ డిసెంబర్‌లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భారీసదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు ఐదు లక్షల మంది బీసీ, ఓబీసీ ఉద్యోగు లు ఉన్నారని.. వీరి సంక్షేమానికి పెద్దపీట వేయా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ చింతాడ రాజశేఖరరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ వై.పోలినాయుడు, ప్రధాన కార్యదర్శిగా బల గ మల్లేశ్వరరావులను ఎన్నుకున్నారు. మిగిలిన వారి ని వారం రోజుల్లో ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి పంపిస్తామని జిల్లా బీసీ ఉద్యోగ సంఘాల నేత డాక్టర్ దువ్వు చక్రపాణి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉద్యోగ సంఘాల నేతలు వై.శంకరరావు, పి. బాలభాస్కరరావు, వి.కామేశ్వరరావు, జె.రామకృష్ణరావు, ఇ.ఎ.ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.నూతన కమిటీ ప్రతినిధులను రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు శాసపు జోగినాయుడు అభినందించారు.


