ఉత్తమ ప్రతిభ కనబరచాలి
ఎచ్చెర్ల : క్రీడల్లో మరింతగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్టీయూకేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ ఆకాంక్షించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎస్.జి.ఎఫ్ సెలక్షన్‌లో పాల్గొని ఎంపికై ఈ నెల 3 నుంచి 6 వరకూ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్‌లో అండర్–19 శ్రీకాకుళం జిల్లా జట్టు తరఫున ట్రిపుల్ ఐటీ విద్యార్థి సాయిగణేష్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని డైరెక్టర్ ఆదివారం అభినందించారు. కార్యక్రమంలో ఏవో ముని రామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, ఇన్‌చార్జి సాగర్, టి.దిలీప్‌కుమార్, కృష్ణంరాజు పాల్గొన్నారు.


