ముగిసిన స్కూల్‌గేమ్స్ జూడో ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ జూడో ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా జూడో అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో జరిగిన ఈ ఎంపికలకు 100 మంది బాలబాలికలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్‌బాబు మాట్లాడుతే పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ, కఠోర సాధన అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్రపోటీల్లో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా పీఈటీ సంఘ నాయకుడు, జూడో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ మాట్లాడుతూ గత ఏడాది స్కూల్‌గేమ్స్ జూడో పోటీల్లో పతకాలు పంట పండించారని.. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో రాణించి పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. కాకినాడ వేదికగా అండర్–17 రాష్ట్రపోటీలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో జూడో కోచ్ పీఎస్ మణికుమార్, సంఘ ప్రతినిధులు మెట్ట తిరుపతిరావు, పాతిన రమేష్‌కుమార్, బి.నిర్మల్‌కృష్ణ, పురుషోత్తం, అనితశ్రీ, పీడీలు, డీఎస్‌ఏ కోచ్‌లు పాల్గొన్నారు.


