గూడు.. గోడు..
● కవిటి: జగతిలో పులకల మల్లేశ్వరరావు ఇంటి రేకు పైకి ఎగిరిపోయింది. ఎర్రగోవిందపుట్టుగలో సైతం మరో పేదవారి ఇంటి గోడకూలింది.
● ఆమదాలవలస రూరల్: పొన్నంపేటలో ఐదు ఇళ్లు, రామచంద్రాపురం గ్రామంలో రెండిళ్ల గోడలు కూలాయి.
● గార: రామచంద్రాపురం పంచాయతీ పాత జొన్నలపాడు గ్రామంలో దూబ సూరమ్మ మంచంపై పడుకొని ఉండగా ఒక్కసారిగా ఇల్లు కూలింది. తోణంగిలో సుగ్గు లక్ష్మీకి చెందిన పురింటి గోడలు కూలిపోయాయి.
● మెళియాపుట్టి: భరణికోట పంచాయతీ పరిధి కాటంవీధిలో సవర సురేష్ అనే గిరిజనుడికి చెందిన మట్టి ఇల్లు కూలిపోయింది. కూలిన సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న బియ్యం ఇతర నిత్యావసర సరుకులు మొత్తం పాడైపోయినట్లు బాధితులు చెబుతున్నారు.
● రణస్థలం: అల్లివలస గ్రామంలో గింతు లక్ష్మి, తిరుపతిపాలెం గ్రామంలో దువ్వాన పైడమ్మ, దుప్పాడ రాజమ్మలకు చెందిన పూరిళ్లు, పెంకుటిళ్లు కూలిపోయాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
● పొందూరు: తుఫాన్ ప్రభావంతో లోలుగులో సెగళ్ల పైడిరాజుకు చెందిన పూరిల్లు కూలింది. కొంచాడలో సిడగ సూర్యనారాయణకు చెందిన పూరిల్లు కూడా కూలింది. వీఆర్ గూడెంలో మూడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
గూడు.. గోడు..


