నేడు భారీ వర్షాలకు అవకాశం
శ్రీకాకుళం పాతబస్టాండ్:
మోంథా మోత మొదలైంది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ మంగళవారం సా యంత్రం, లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వర్షా లు కురిశాయి. జిల్లాలోని ప్రధాన నదులు వంశధార, నాగావళి ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. వర్షాలు అధికమైతే వరద వచ్చే అవకాశం ఉంది.
తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రత్యేకాధికారి కేవీఎన్ చక్రధరబాబు సోమవారం పోలాకి తదితర మండలాల్లో పర్యటించారు. ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు 11 మంది సభ్యులు గల ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్ జిల్లాలోనే సామగ్రితో సిద్ధంగా ఉంది.
కొనసాగుతున్న కంట్రోల్ రూమ్‌లు..
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయాన్ని పొందేందుకు అందుబాటులో కంట్రోల్ రూమ్‌లు ఉంచారు. రెండు రోజుల నుంచి కలెక్టర్, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు కొనసాగుతున్నాయి.
ప్రజలు బయటకు రాకూడదు
తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాలువలు, చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు
తుఫాన్ ప్రభావం ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మన తీరంలో 11 మండలాలు, 236 గ్రామాలు, సుమారుగా 1.90 లక్షల జనాభా ఉన్నారు. తీర ప్రాంతంలో 41 తు ఫాన్ షెల్టర్లు ఉన్నాయి. వీటిలో అవసరం మేరకు అన్నీ సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల్లో మరో 80 తాత్కాలిక పునరావాస కేంద్రాలు గుర్తించి సిద్ధం చేశారు. 41 తాగునీటి ట్యాంకర్లు ఉంచారు.
185.4 మిల్లీమీటర్ల వర్షం
జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 185.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సా యంత్రం వరకు 592.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇంకా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఈ వానలు మరింత ఎక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
వర్షం (మిల్లీమీటర్లలో) ఎక్కడెక్కడ.. ఎంతెంత..


