తుఫాన్ పునరావాస కేంద్రం పరిశీలన
పోలాకి: తుఫాన్ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులతో కో ఆర్డినేట్ చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి కేవీఎస్ చక్రధరబాబు సూచించారు. సోమవారం పోలాకి మండలంలోని డీఎల్‌పురం తుఫాన్ షెల్టర్‌ను పరిశీలించారు. ముఖ్యంగా తీరప్రాంత గ్రామాలు, లోతట్టు గ్రామాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో సేవలందించేలా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నా రు. మండలంలో నాలుగుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు వివరించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఉన్నారు.


