
తపాలా ఉద్యోగుల నిరసన
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఉద్యోగం నుంచి తొలగించిన తపాలా ఉద్యమ జాతీయ నాయకుడు మహాదేవయ్యను వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఽతపాలా ఉద్యోగుల సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద జిల్లా నలుమూలల నుంచి దాదాపు 300 మంది పోస్టల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నందికేశ్వరరావు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు గణపతి, పోస్టల్ ఉద్యమ జిల్లా నాయకులు యు.వి.రమణ, బాబురావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.