
మహిళలపై నేరాలు అరికట్టలేకపోతున్నాం
● ప్రజల అభిప్రాయం కూడా ఇలాగే ఉంది
● మహిళా పోలీసులతో ఎస్పీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : ‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టలేకపోతున్నాం.. ప్రజల అభి ప్రాయం అదే’ అంటూ ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి కుండబద్దలుగొట్టారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు ఆమదాలవలస మండలం కొర్లకో ట సచివాలయ పరిధిలో 67 శాతం ప్రజలు ఐవీఆర్‌ఎస్‌లో ఓటింగ్ చేశారని, ఎచ్చెర్ల మండలం కుప్పిలి–2 సచివాలయ పరిధిలోనూ 60 శాతం మంది ఇలాగే చెప్పారని ఉదాహరణలతో సహా ఎస్పీ వెల్లడించారు. మహిళా పోలీ సులతో జిల్లా కేంద్రంలోని బృందావనం ఫంక్షన్ హాల్ వార్షిక సమావేశంలో బుధవారం సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. సమావేశం ప్రారంభంలో కొందరు సమస్యలు చెప్పడంతో ఆయన వాస్తవాలు బయటపెట్టారు. ‘దాదాపు 800 మహిళా పోలీసుల్లో ఎంతమంది బాగా పనిచేస్తున్నారు..? ఎంతమంది సక్రమంగా లీవ్‌లు వాడుతున్నారు’ అంటూ చురకలంటించారు. పనిచేసే పోలీసులందరికీ ఆయా సందర్భాల్లో అవార్డులు ఇస్తున్నామని, ఆఖరికి హోంగార్డులు కూడా అందుకుంటున్నారని, మీరు ఏ స్థానంలో ఉన్నారో ఆలోచించుకోవాలన్నారు. హోంగార్డుల నుంచి అడిషనల్ ఎస్పీల వరకు తన వద్ద ఫీడ్ ఉందని, వారి మంచి చెడు రెండూ తనకు తెలుసని, ఇక మీ మహిళా పోలీసులపై దృష్టిపెడతానని, మైండ్‌సెట్ మార్చుకోవాల్సిందే అంటూ హెచ్చరించారు.
జీరో వైలెన్సే లక్ష్యం..
రానున్నది స్థానిక సంస్థల ఎన్నికల సీజన్ అని, గ్రా మాల్లో ట్రబుల్‌మాంగర్స్, షీటర్లు, రౌడీషీటర్లను గుర్తించాలని, ఎప్పుడో జరిగిన గొడవలను ఎన్నికల రోజు, ప్రచారాలు చేసే సమయంలో రాజేసే వారుంటారని అలాంటి లిస్టంతా నవంబర్ 15 కల్లా సిద్ధంగా ఉంచాలని మహిళా పోలీసులకు డెడ్‌లైన్ పెట్టారు. లాఅండ్‌ఆర్డర్ పోలీసులకు ఇప్పటికే అక్టోబర్ 15కల్లా లిస్ట్ సిద్ధం చేయమని చెప్పామన్నారు. ఎన్నికల్లో తన టార్గెట్ జీరో వైలెన్స్ అని స్ప ష్టం చేశారు. ఉమెన్‌హెల్ప్‌డెస్క్, శక్తియాప్, నారీ శక్తి వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గతంలో కంటే క్రైమ్ రేట్ తగ్గిందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, టౌన్ డీఎస్పీ వివేకానంద పాల్గొన్నారు.

మహిళలపై నేరాలు అరికట్టలేకపోతున్నాం