
ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం
బూర్జ: పేదలకు, విద్యార్థులకు తీరని నష్టం కలిగించే ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రయివేటీకరణను తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ సమక్షంలో బూర్జ మండలం లక్కుపురం, అల్లెన, డొంకలపర్త గ్రామాల్లో బుధవారం కోటి సంతకాల మహా ఉద్యమం, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ విద్య, వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారని, ఆ గొప్ప ఆశయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.