
రైతులకు పరిహారం ఇప్పించాలని వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలులు, వరదలకు పాతపట్నం నియోజకవర్గంలో సుమారు 5250 ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని, ఆ పంటలకు ప్రభుత్వం తరఫున పరిహారం ఇప్పటించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.