
నాచు పెంపకంపై అవగాహన
ఎచ్చెర్ల : బుడగట్లపాలెం సముద్రతీరంలో కఫ్పా ఫైకాస్ జాతి సముద్ర నాచు పెంపకంపై స్థానిక మత్స్యకార స్వయం సహాయక సంఘాల మహిళలకు బుధవారం మత్స్యశాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికచేసి నాచు పెంపకం చేపడుతున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు వై.సత్యనారాయణ తెలిపారు. 50 మంది మహిళలకు 10 మంది మత్స్యకారులు శిక్షణ పొందుతున్నారని చెప్పారు. నాచు కొనుగోలు చేసే బాధ్యత మత్స్యశాఖ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లుపల్లి రాంబాబు, మత్స్యశాఖ ఎఫ్‌డీవో రవి, జీఎఫ్ ప్రతినిధి శామ్యూల్, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చీకటి శ్రీరాములు, మహిళలు, మత్స్యకారులు పాల్గొన్నారు.