
పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు ఘనత పూర్తిగా ఆయనదే
విద్య, వైద్య రంగాలకు వైఎస్ జగన్ ప్రాధాన్యం
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ప్రైవేటు హొటల్‌లో ధర్మాన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అనేక దశాబ్దాలుగా ఏ ఒక్కరూ శాశ్వత పరిష్కారం ఆలోచన చేయలేదని, ఉద్దానం కిడ్నీ సమస్యను అన్ని రాజకీయ పార్టీలు వాడుకుని లబ్ధి పొందాయే కానీ, సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కోసం ఏ ప్రభుత్వాలు ప్రయ త్నించలేకపోయాయని ధర్మాన తెలిపారు. వైఎస్ జగన్ మొదటిసారి సీఎం అయినా కూడా సమస్యను అర్థం చేసుకుని వంద కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు.
తానే భూమి పూజ చేసి ప్రారంభించి, నిర్మాణం చేసి, ఆస్పత్రిని ప్రారంభించడం వైఎస్ జగన్ ఘనత అన్నారు. భూగర్భ జలా లు తాగడం వల్లే కిడ్నీ సమస్య వస్తుందన్న వైద్యుల సూచనతో మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.800 కోట్లతో హిరమండలం రిజర్వాయర్ నుంచి నీరు తీసుకొచ్చారని తెలిపారు. దివంగత వైఎస్సార్ కూడా ఉచిత విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పించారని, ఆయన తనయుడు మరో పదడుగులు ముందుకేసి మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని చెప్పారు. మిగిలిన వాటిని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ఆలోచన చేయడం సరికాదన్నారు. పీపీపీ విధానాన్ని కట్టిపెట్టి ఉచిత వైద్యవిద్యకు కట్టుబడి ఉండాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్ప దని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హ యాంలో విద్య, వైద్య రంగాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో శత్రువులైనా అంగీకరించక తప్పదన్నారు. నాడు–నేడు ద్వారా కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, పాత ఆస్పత్రుల ఆధునికీకరణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య ఆసరా, గ్రామాల్లో హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రైవేటుకు అప్పగిస్తే జనం ప్రాణాలకు డబ్బుతో విలువ కడతారని అన్నారు. శవాలకి సైతం వైద్యం చేసి డబ్బులు దోచుకుంటున్న పరిస్థితులు ఇప్పుడున్నాయన్నారు.
ఓ నిరుపేద కుటుంబానికి అనారోగ్యం వస్తే ఆయన జీవితకాలంలో సంపాదించినసొమ్ముతో పాటు ఆస్తుల్నికోల్పోయి రోడ్డు న పడుతున్నారన్నారు. అలాంటి పరిస్ధితి లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని వివరించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యాలు అవసరం లేద ని కేవలం కార్పోరేట్లకు దోచిపెట్టడమే వారికి తెలిసిన పాలన అని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే పేదోడి గొంతుకై వైఎస్సార్‌సీపీ ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.