
బురద నీరే.. తాగునీరు
కళింగపట్నం పంచాయతీ నగరాలపేట ఎస్సీ కాలనీలో బురద నీరు సరఫరా కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం గార వద్దనున్న రక్షిత పథకం నుంచి నీరు సరఫరా కాగా బురదనీరే వచ్చింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని వారంతా కోరుతున్నారు.
– గార
గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో సుమారు 30 కేజీల గంజాయితో ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయంలో మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైల్వేస్టేషన్ తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన అంబరేష్, ఆర్.వెంకటసాయిలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. బ్యాగ్‌లో 29.150 కేజీల గంజాయిని గుర్తించారు. వీరు ఒడిశాలోని ఖనుచరణ్ వద్ద నుంచి గంజాయిని కొనుగోలుచేసి బళ్లారిలో గంజాయి వ్యాపారం చేస్తున్న రాముకి ఇచ్చేందుకు బరంపురం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. అక్కడ పోలీసులు తనిఖీలు ఎక్కువగా ఉండగా బస్సు ద్వారా ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్‌కి వెళ్తుండగా పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయి, సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. పట్టణ పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి ఎస్‌ఐ వి.రవివర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

బురద నీరే.. తాగునీరు

బురద నీరే.. తాగునీరు