
హెవీ డ్రైవింగ్ లైెసెన్స్‌కు 32 మంది దరఖాస్తు
శ్రీకాకుళం పాతస్టాండ్: హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు సూ చించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన దరఖాస్తులను పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా రు. మొత్తం 32 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో పది మందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎచ్చెర్లలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పీవీ గంగాధర్ అభ్యర్థులకు ఉన్న డ్రైవింగ్‌లో వారి నైపుణ్యాన్ని పరిశీలించారు. సర్టిఫికెట్ల పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తో పాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.గడ్డెమ్మ, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పీవీ గంగాధర్, ఆర్టీసీ డిపో – 1 డీఎం అమర సింహులు, ఆర్టీసీ పీఆర్‌ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎట్టకేలకు సత్యవరానికి తాగునీరు
నరసన్నపేట: మేజర్ పంచాయతీ పరిధిలోని సత్యవరానికి ఎట్టకేలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. ట్యాంకు వద్ద మరమ్మతునకు గురైన పైపువాల్స్‌ను మార్చి మంగళవారం కొత్తవి అమర్చారు. ఈ పనులను ఈఓ ద్రాక్షాయిని పర్యవేక్షించారు. దీంతో సాయంత్రం సత్యవరానికి తాగునీటిని కుళాయిల ద్వారా పంపిణీ చేశారు.
‘సమ్మె జయప్రదం చేయండి’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుదామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయు డు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15 నుంచి జరిగే విద్యుత్ కార్మికుల సమ్మైపె సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రైవేటీకరణ విధానాల నుంచి సంస్థను రక్షించుకోవాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మేధావులంతా విద్యుత్ సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ సీనియర్ నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, శ్రీకాకుళం టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాష్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు.