
టీచర్లు, పోలీసులే ఎక్కువ..
ఫేక్ లోన్లు పొందిన వారిలో ఎక్కువగా టీచర్లు, పోలీసులే ఉన్నారు. వీరంతా గతంలో హౌసింగ్ లోన్ కోసం వివిధ బ్యాంకులు చుట్టూ తిరిగి మంజూరుకానివారే. శివకుమార్ కన్సల్టెన్సీగా ఉండటం.. అందునా అతని తండ్రి రిటైర్డ్ ఏఆర్ ఎస్‌ఐగా ఉండటంతో నమ్మారు. శివకుమార్ సైతం వారి నుంచి ఒరిజినల్ సేల్ డీడ్ తప్ప మిగతా లింక్ డాక్యుమెంట్లు, అడంగల్, 1బీ, ఇంటి పన్ను ఒకటేమిటి అన్ని ఫోర్జరీ సంతకాలతో అధికారుల రబ్బరు స్టాంపులను దుర్వినియోగపర్చి చేశాడు. వాస్తవానికి కొన్ని బ్యాంకులు సుడా పర్మిషన్, నాలా పర్మిషన్ లేనిదే లోన్ ఇవ్వవు. ఇవి వర్తించని బ్యాంకులను గుర్తించి పని చేసుకున్నారు. రెవెన్యూ విభాగం నుంచి కూడా రిజిస్ట్రేషన్ అయిన వాటికే లింక్ డాక్యుమెంట్లు, ఇతరత్రా సంతకాలు చేస్తారు. ఐదారేళ్లుగా జరుగుతున్న ఈ కుంభకోణంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల పాత్ర ఏంటి..? సంతకాల ఫోర్జరీపై ఆ విభాగాల అధికారులు సైలెంట్‌గా ఉండటం ఏంటన్నది తెలియాల్సి ఉంది.