
ఆర్.బెలగాం యువకుడి ప్రతిభ
కవిటి: ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో భారత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్వెస్ట్–2025లో కవిటి మండలం ఆర్.బెలగాం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ రత్నాల సుమిత్‌కుమార్ సత్తాచాటాడు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో బ్యాంక్ లావాదేవీలు, పేమెంట్ డేటా, రియల్ టైమ్ ఫ్రాడ్ డిటెక్షన్ తదితర సమస్యల పరిష్కారంపై ఆన్‌లైన్ టెస్ట్, కోడ్ అండ్ డేటా సైన్స్ చాలెంజ్, అడ్వాన్స్‌డ్ ఏఐ వర్క్ షాప్ తదితర విభాగాల్లో సుమిత్‌కుమార్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా మహరాష్ట్ర సీఎం చేతుల మీదుగా రూ.5 లక్షల నగదు, అవార్డు శనివారం అందుకున్నారు. రత్నాల కామేశ్వరరావు, ప్రమీల దంపతుల కుమారుడు సుమిత్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కేఎంఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యువకుడి విజయం పట్ల కవిటి మండల సొండికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాండవ రామారావు హర్షం వ్యక్తం చేశారు.