
పగలు డంప్.. రాత్రి జంప్!
● దర్జాగా కూటమి నేత ఇసుక దందా
● నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ డంప్
● అధికారులు తనిఖీ చేసినా ఫలితం శూన్యం
ఇచ్ఛాపురం రూరల్: బాహుదా నది పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమ దందా దర్జాగా సాగుతోంది. రాత్రికి రాత్రి ట్రాక్టర్లలో ఊరు దాటించి విక్రయిస్తున్నారు. అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుకాసురుల దందాకు అడ్డే లేకుండా పోతుంది. మశాఖపురం గ్రా మానికి చెందిన ఓ కూటమి నాయకుడు వారం రోజుల పాటు సుమారు నాలుగు వందల ట్రాక్టర్ల లోడుల ఇసుకను బాహుదా నది నుంచి డంప్ చేసి నదీ పరివాహక ప్రాంతంలో భద్రపరిచాడు. ఒక్కో ట్రాక్టర్ లోడును రూ.1500 నుంచి రూ.2వేల వరకు అమ్మకానికి బేరం కుదిర్చారు. ఈ విషయమై గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంలో శనివారం మండల రెవెన్యూ అధికారి చిరంజీవి సాహు, వీఆర్వో పటాన తారకేశులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇసుక రీచ్‌ను పరిశీలించి కూటమి నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు సోమవారం వస్తారని, అ ప్పటి వరకు ఇసుక రీచ్‌లను ముట్టుకోవద్దని ఆ దేశాలు జారీ చేశారు. కానీ కూటమి నాయకుడు దౌర్జన్యంగా ఆదివారం సాయంత్రం నుంచి ట్రా క్టర్ల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతానికి తరలించడంతో గ్రామస్తులు మరోమారు తహసీల్దార్ కా ర్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ ఫలితం కనిపించలేదు.
అధికారులకు సమాచారం అందించాం
స్థానికుల ఫిర్యాదు మేరకు మశాఖపురం గ్రామంలో అనధికారికంగా సుమారు 400 ట్రాక్టర్ల లోడుల అక్రమ ఇసుక ఉన్నట్లు స్వయంగా గుర్తించాం. ఇప్పటికే సంబంధిత విజిలెన్స్ మైన్స్ అధికారులకు సమాచారం అందించాం. ఇసుక రీచ్‌లను ముట్టుకోవద్దని సంబంధిత వ్యక్తికి హెచ్చరించాం. ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– చిరంజీవి సాహు,
మండల రెవెన్యూ అధికారి, ఇచ్ఛాపురం

పగలు డంప్.. రాత్రి జంప్!