
మద్యం దుకాణాల్లో ఎకై ్సజ్ తనిఖీలు
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 34 మద్యం దుకాణాలను ఆదివారం అధికారులు తనిఖీ చేశారు. దుకాణాల్లో కొన్ని మద్యం బ్రాండ్లను స్పాట్ కెమికల్ టెస్టు నిర్వహించి వాటిని ఎనాలసిస్ చేసేందుకు విశాఖపట్నం ల్యాబ్‌నకు తరలించారు. ఈ మేరకు సీఐ ఎం.వి.గోపాలకృష్ణ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి 367 శాంపిల్స్ ల్యాబరేటరీకి పంపి వాటి నివేదికలను తెప్పించామని, వాటి ఆధారంగా ఏపీఎస్‌బీసీఎల్ నుంచి సరఫరా అవుతున్న మద్యం పూర్తి నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యిందన్నారు. మద్యం అమ్మకాల్లో ఎలాంటి తప్పిదాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నౌకరీనామాదారులను హెచ్చరించామన్నారు. అక్రమ మద్యం విక్రయాల గురించి సమాచారం తెలిస్తే 14405కి ఫిర్యాదు చేయాలన్నారు.