
డీఆర్‌ఓల సంఘం కార్యవర్గ ఎన్నిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అడ్‌హక్ అధ్యక్షుడిగా డి.రాజేష్ ఎన్నికయ్యారు. శనివారం శ్రీకాకుళంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన అంజనీకుమార్ (చంటి) అధ్యక్షతన వీఆర్‌ఓల సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు ( గ్రేడ్–1, 2, ప్రమోటీ, నామినీ) హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా డి.రాజేష్, సహాధ్యక్షుడిగా ప్రవీ ణ్, జనరల్ సెక్రటరీగా బి.రాంజీ, ట్రెజరర్‌గా జి. డిల్లేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్‌లుగా ఎన్.అప్పలనా యుడు, పి.శ్రావణి, జాయింట్ సెక్రటరీలుగా ఎస్. కొండలరావు, ధనలక్ష్మి, వెబ్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ సెక్రటరీగా మనోజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా విశ్వనాథం, స్పోర్ట్సు అండ్ కల్చరల్ సెక్రటరీగా నాగరాజు, స్టేట్ ఈసీ సభ్యులుగా గణేష్ ప్రసాద్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏపీఆర్‌ఎస్ ఏ స్టేట్ సెక్రటరీ పి.శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రట రీ బి.వి.వి.ఎన్.రాజు, ఏపీవీఆర్‌ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అనుపమ, అసోసియేట్ ప్రెసిడెంట్ బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.