
● క్షతగాత్రులకు పరామర్శ
టెక్కలి: మెళియాపుట్టి మండలం గంగరాజపురం సమీపంలో రాజయోగి గ్రానైట్ క్వా రీలో జరిగిన సంఘటనలో తీవ్రంగా గాయపడి టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. సంఘటన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితులపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యారావును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందజేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భరోసా ఇచ్చారు.