
శ్రీకాకుళం
న్యూస్‌రీల్
సారవకోట మండలం అవలింగి సమీపంలోని దుర్గా వైన్ షాపులో, సమీపంలోని ఇంట్లో సెప్టెంబర్ 2వ తేదీన నకిలీ మద్యం దొరికింది. మందుబాబుల ప్రాణాలు తీసే మద్యంగా అనుమానాలు ఉన్నాయి. ఒడిశా, చత్తీస్‌గఢ్ నుంచి తీసుకొచ్చిన ఆల్కహాల్‌కు కలర్ కలిపి నకిలీ మద్యం తయారు చేసి, బాటిలింగ్ చేసి విక్రయిస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దానికోసమే ఏకంగా ఇళ్లు అద్దెకు తీసుకుని, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంట్లో వేలల్లో ఖాళీ సీసాలు, నకిలీ మూతలు, బ్యాచ్ నంబర్ స్టాంపింగ్ మిషన్ వంటివి దొరికాయి.
అంతకుముందు టెక్కలి ఆర్టీసీ డిపో సమీపంలో ఓ మద్యం దుకాణంలో కొన్న సీసా సీల్‌లో తేడా ఉండటాన్ని గుర్తించారు. మూతతీసి చూసి మద్యం కల్తీ అయిందని గుర్తించారు. రెగ్యులర్‌గా అదే బ్రాండ్ తాగే వ్యక్తికి తేడా తెలియడంతో కల్తీ అయిందని గోల పెట్టారు.
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

శ్రీకాకుళం