
బెల్టుషాపులకే కల్తీ మద్యం..
జిల్లాలో తయారవుతున్న కల్తీ మద్యం బాటిల్స్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్‌షాపులకే వెళ్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సిండికేట్ నడుస్తోంది. ఒకవైపు కౌంటర్‌లో ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేపడుతుండగా, మరోవైపు పర్మిట్, బెల్ట్‌షాపులను ప్రోత్సహిస్తోంది. సిండికేట్ అంతా టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. వారు ఏం చెబితే అదే జరుగుతోంది. ఫలితంగా బెల్ట్‌షాపుల్లో తనిఖీలు, పట్టుకోవడాలు జరగడం లేదు. ముడుపులు నడుస్తుండటంతో అంతా గుట్టుగా సాగిపోతోంది. రాజకీయ విభేదాలు తలెత్తితేనే గుట్టు బయటపడుతోంది.