జిల్లాకూ నకిలీ మకిలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాకూ నకిలీ మకిలి

Oct 9 2025 3:01 AM | Updated on Oct 9 2025 3:01 AM

జిల్లాకూ నకిలీ మకిలి

జిల్లాకూ నకిలీ మకిలి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నకిలీ మద్యం ఆనవాళ్లు జిల్లాలోనూ కనిపించాయి. నిజానికి రాష్ట్రంలోని మిగతా చోట కంటే ముందే శ్రీకాకుళం జిల్లాలో ఈ బాగోతం బయటపడింది. ఇందులో టీడీపీ నాయకుడు మీసాల నీలకంఠం పాత్ర ఉన్నట్టు తేలింది. ఇప్పుడాయన ముందస్తు బెయిల్‌ కోసం యత్నిస్తున్నారు. ఒడిశాకు ఆనుకుని ఉన్న టెక్కలి, ఉద్దానం వంటి ప్రాంతాల్లో చీప్‌ లిక్కర్‌కు ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌(స్పిరిట్‌), కెరామల్‌ వంటి రసాయనాలు కలిపి ఏకంగా బాటిల్స్‌ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆంధ్రాలోని ఖరీదైన వైన్‌లో కూడా చీప్‌ లిక్కర్‌, వాటర్‌ మిక్సింగ్‌ చేసి బాటిల్స్‌ తయారు చేస్తున్నారు.

ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కల్తీ మద్యం దందా నడుస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాలకు పడవలపై ఒడిశా నుంచి చీప్‌ లిక్కర్‌, సారా వస్తోంది. అక్కడి నుంచి వచ్చిన లిక్కర్‌ను జిల్లాలోని రహస్య ప్రాంతాలకు తరలించి బ్రాండ్‌ మిక్సింగ్‌ చేస్తున్నట్టుగా సమాచారం. దానికోసం ప్రత్యేకంగా ఖాళీ సీసాలు, నకిలీ మూతలు, బ్యాచ్‌ నంబర్‌ స్టాంపింగ్‌ మిషన్లను అక్రమార్కులు సమకూర్చుకున్నారు. సారవకోట మండలం అవలింగిలో ఇప్పటికే ఇవన్నీ దొరికాయి. రాజకీయ విభేదాల కారణంగా అక్కడ గుట్టు రట్టయ్యింది. లేదంటే గుట్టు చప్పుడుగా సాగిపోయేదే. మిగతా ప్రాంతాల్లోనూ ఈ రకమైన డెన్‌లు నడుస్తున్నట్టు తెలుస్తోంది.

గుర్తించలేనంతగా..

జిల్లాలో నిపుణుల చేత కల్తీ చేయిస్తూ అసలేదో, కల్తీ ఏదో గుర్తించలేనంతగా మందుబాబులను మోసం చేస్తున్నారు. ఈ కల్తీ చాలా చోట్ల అనుభవం ఉన్న నౌకర్‌ నామాలే చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అందుకనే దాదాపు వైన్‌ షాపుల నిర్వాహకులు అనుభవం ఉన్న నౌకర్‌ నామాలను పెట్టుకుంటారు. దీనికి తోడు పర్మిట్‌ రూమ్‌లకు కూడా అనుమతి ఇవ్వడంతో కల్తీ మరింత సులభం అవుతోంది. లూజు అమ్మకాలు జరుగుతుండటంతో అక్కడికక్కడే బ్రాండ్‌ మిక్సింగ్‌ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.

కల్తీ మద్యంతోనే ప్రమాదం

ఒడిశాకు అనుకుని సరిహద్దు ప్రాంతాలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి తదితర నియోజకవర్గాలు ఒడిశాకు దగ్గరలో ఉన్నాయి. ఒడిశాలో ప్రస్తుతం చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ బాటిల్‌ ధర రూ.70నుంచి రూ.150వరకు ఉంది. అదే ఆంధ్ర ప్రదేశ్‌లోనైతే రూ. 99నుంచి రూ.220వరకు ఉంది. ఇక్కడ కంటే ఒడిశా చీప్‌ లిక్కర్‌ క్వాలిటీ బాగుం

ఒడిశా సరిహద్దు నియోజకవర్గాల్లో నకిలీ మద్యం తయారీ

సారవకోట మండలం అవలింగిలో బయటపడిన నకిలీ మద్యం బాగోతం

నకిలీ మద్యం కేసులో పరారీలో టీడీపీ నాయకుడు నీలకంఠం

టెక్కలిలో బయటపడ్డ రెండు మూడు పరిణామాలు

టీడీపీ నాయకుల చేతుల్లోనే సిండికేట్‌

నకిలీ, కల్తీ మద్యమంతా బెల్ట్‌షాపులకే వెళ్తున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement