ఆకాశ దీపం వెలిగింది | - | Sakshi
Sakshi News home page

ఆకాశ దీపం వెలిగింది

Oct 9 2025 3:01 AM | Updated on Oct 9 2025 3:01 AM

ఆకాశ

ఆకాశ దీపం వెలిగింది

జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ఆలయంపైన బుధవారం ఆకాశ దీపం వెలిగించారు. ఒడిశా సంప్రదాయం ప్రకారం ఆశ్వ యుజ మాసం పౌర్ణమి అనంతరం బహుళ పాఢ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ ఇలా ప్రతి రోజూ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాన్ని వెలిగిస్తారు. పాఢ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ ఒడిశా నుంచి భక్తుల తాకిడి ఉంటుందని అర్చకులు తెలిపారు. అలాగే ఒడిశా వాసులు గౌరీపౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ కార్తీక మాసంగా పాటిస్తారు.

నాడు కాదని..

నేడు అదే పని!

శ్రీకాకుళం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చేస్తున్న ప్రకటనలకు చేపడుతున్న పనులకు పొంతన లేకుండా పోతోంది. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో కొందరు టీచర్లకు రాష్ట్రస్థాయిలో బదిలీలను చేశారు. అయితే విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో వీరిని రిలీవ్‌ చేయలేదు. అప్పట్లో నారా లోకేష్‌ రాష్ట్రస్థాయి బదిలీలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే ఆ బదిలీలను రద్దు చేశారు. ఇప్పు డు తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో బదిలీలు చేయడం గమనార్హం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు ఓ ఉపాధ్యాయురాలికి ఇలా బదిలీ జరిగింది. ఈమె భర్త ఓ ప్రజా ప్రతినిధి వద్ద పీఏగా పనిచేస్తున్నట్లు సమాచా రం. పైగా దీన్ని రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. బదిలీల ఉత్తర్వులు సహజంగా మెయిల్స్‌ ద్వారా విద్యా శాఖకు వస్తుంటాయి. ఈసారి మాత్రం బదిలీల ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖ అధికారుల వాట్సాప్‌కు పంపడాన్ని ఉపా ధ్యాయ వర్గాలు తప్పుపడుతున్నాయి.

సువర్ణభూషిత కూర్మనాథుడు

దశాబ్దాల తర్వాత కూర్మనాథునికి ఆభరణాల అలంకరింపు

80 ఏళ్లుగా సింహాచలం దేవస్థానంలో భద్రపరిచిన వైనం

గార: ఎనభై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూర్మనాథుని సువర్ణ ఆభరణాలు మళ్లీ స్వామి విగ్రహాన్ని అలంకరించాయి. ఎనిమిది దశాబ్దాల పాటు సింహాచలంలోనే ఉండిపోయిన ఆభరణాలు మళ్లీ ఇన్నాళ్లకు అవి శ్రీకూర్మం చేరాయి. శ్రీకూర్మనాథుని ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి, గోవిందరాజస్వామి, శ్రీరామ, లక్ష్మణస్వామి, సీతమ్మ వార్లకు బంగారు ఆభరణాలను బుధవారం అలంకరించారు. సుమారు 3 కిలోల బంగారం కలిగిన ఆభరణాల్లో గోవిందరాజస్వామి, శ్రీరామ, లక్ష్మణ విగ్రహాలకు వక్ష స్థలం, కవచాలు, కంటెలు, భుజ కీర్తులు వంటివి ఉండగా, అమ్మవార్ల విగ్రహాలకు కిరీటాలతో పాటు మెడలో వేసుకున్న శేరులు వంటివి ఉన్నాయి.

80 ఏళ్ల కిందట ఆభరణాలకు ఆలయంలో రక్షణం కల్పించలేమని అప్పటి అధికారుల అభ్యర్థనతో సింహాచలం దేవస్థానంలో భద్రపరిచారు. అప్పటి నుంచి శ్రీకూర్మనాథాలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలైన డోలోత్సవం, కల్యాణోత్సవం, శ్రీకూర్మనాథుని జయంత్యుత్సవాలకు సైతం వీటిని తీసుకురాలేదు. ఆలయంలో పనిచేస్తున్న వైదిక సిబ్బంది, అధికారులు చాలా మంది వీటిని ఇప్పటివరకు చూడలేదు. దేవస్థానం ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు గోవా గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఆలయానికి వచ్చి దీనిపై లేఖ రాస్తానని చెప్పారు. గురువారం ఉదయం భద్రత నడుమ తీసుకువచ్చి గర్భగుడి సమీపంలోని అద్దాల మంటపంలోని స్వామి ఉత్సవ మూర్తులకు అలకరింపజేసి భక్తుల దర్శనార్థం ఉంచారు.

ఆకాశ దీపం వెలిగింది 1
1/1

ఆకాశ దీపం వెలిగింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement