
న్యాయ పోరాటం చేద్దాం
● రైతు సంఘం నాయకుడు
వడ్డే శోభనాద్రీశ్వరరావు
పలాస: పచ్చటి ఉద్దానంలో నిర్మించతలపెట్టిన కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా న్యాయ పోరా టం చేయాలని మాజీ మంత్రి, రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. మందస మండలం ఎం.గంగువాడ గ్రామంలో బుధవారం కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహించా రు. కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అధ్యక్షతన జరిగిన ఈ సభలో శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు పోరాటాల్లో ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక కన్వీనర్ మహదేవ్ మాట్లాడుతూ పోలీసు నిర్బంధం పైన హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
అడుగడుగునా ఆంక్షలే
మందస: మందస మండలం ఎం.గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఎక్కడికక్కడ పోలీసు వాహనాలు పెట్టి బహిరంగ సభ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చివరకు తోటలో నిర్వహించుకోవడానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.
వ్యతిరేకంగా పోరాటం చేస్తాం..
కార్గో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా 15 నెలల నుంచి పోరాటం చేశాం. దానిపై ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే పోలీసులతో నిలిపివేయించారు. ఇలాంటి కుతంత్రపు రాజకీయాలు ఎందుకు..?
– బత్తిన లక్ష్మణరావు, భేతాళపురం
ఉద్దానాన్ని వదులుకోబోము..
ఎన్ని అవాంతరాలు ఎదురైనా కార్గో ఎయిర్‌పోర్టును నిలిపి తీరుతాం. మా పచ్చటి ఉద్దానాన్ని వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము.
– కె.మోహన్‌రావు, సీపీఎం కార్యదర్శి

న్యాయ పోరాటం చేద్దాం

న్యాయ పోరాటం చేద్దాం