
గిరిజనులకు శాపం
ప్రకృతి ప్రకోపం.. నాణ్యతా లోపం..
● ఇటీవల వర్షాలకు ఛిద్రమైన ఏజెన్సీ రోడ్లు
● రాకపోకలకు తప్పని పాట్లు
మెళియాపుట్టి: ప్రకృతి ప్రకోపానికి తోడు పనుల్లో నాణ్యత లేకపోవడంతో గిరిజన రహదారులు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిజన గ్రామాలైన మెళియాపుట్టి మండలం కేరాసింగి, గూడ గ్రామాలకు వెళ్లే రహదారులు కనీసం నడవటానికి కూడా అవకాశం లేని స్థితికి చేరుకున్నాయి. కేరాసింగి రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొత్తూరు వెళ్లే రహదారితో పాటు పలురోడ్లు కోతకు గురికావడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అధికారులు పరిశీలనకు వచ్చి చూసి వెళ్లిపోతున్నారు తప్ప రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేయించాలని గిరిజనులు కోరుతున్నారు.

గిరిజనులకు శాపం