
పోడు పంట.. ఆరోగ్యకరమంట..!
అధికంగా పండిస్తున్న సవరజాడుపల్లి గిరిజనులు సేంద్రియ పంటలు విక్రయిస్తూ జీవనం ఆసక్తి చూపిస్తున్న పరిసర ప్రాంతాల ప్రజలు
మెళియాపుట్టి:
ప్రస్తుతం మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అత్యధిక శాతం రసాయనిక ఎరువులు వినియోగించి పండించినవే. మార్కెట్‌లో రసాయనిక ఎరువు లు లేకుండా పండిన కూరగాయలు, పండ్లు దొరక డం ఈరోజుల్లో గగనమైపోయింది. అయితే ఇటువంటి తరుణంలో మండలంలోని సవర జాడుపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు పోడు భూముల్లో సేంద్రియ పద్ధతిలో పంటలు, పండ్లను పండిస్తూ ఆరోగ్యానికి భరోసానిస్తున్నారు. వారికి ఉన్నటువంటి పోడు భూముల్లో నిత్యం పనులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన పంటలకు ప్రాధాన్యమిస్తూ జీవన భృతిని కొనసాగిస్తున్నారు. సీతాఫలం, జామ, అర టి, పనస, అనాస, బొప్పాయి, మామిడి, జీడి వంటి పంటలను పండిస్తూ గ్రామ సమీపంలోని రహ దారి వద్ద విక్రయిస్తుంటారు. సహజ సిద్ధంగా పండి స్తున్న పంటలు కావడంతో రాహదారిలో రాకపోక లు సాగించేవారు అధికంగా కొనుగోలు చేస్తుంటా రు. అయితే ప్రభుత్వ సహకారం అందిస్తే మరిన్ని రకాలైన కమలా, బత్తాయి, దానిమ్మ, నిమ్మ లాంటి తోటలు పెంపకానికి అవకాశం ఉంటుందని అక్కడి గిరిజనులు చెబుతున్నారు.