
అనకాపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
నరసన్నపేట: అనకాపల్లి జిల్లా మర్కాపురం మండలం భీమబోయినపాలెంలో ఈ నెల 9వ తేదీన జరిగే మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుండగా.. ప్రజా వైద్య సేవలను కాపాడాలనే నినాదంతో ఈ నెల 9న మార్కాపురం మండలం భీమబోయిన పాలెంకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శన కార్యక్రమం ఉంటుందన్నారు. వైద్య రంగాన్ని ప్రజా సేవా దృక్పథంతో కొనసాగించాలన్న డిమాండ్‌తో జరగబోయే ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై పర్యటనను విజయవంతం చేయాలని కృష్ణదాస్ కోరారు.
శిశు గృహ, బాల సదన్
ఆకస్మిక తనిఖీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అరసవల్లిలోగల శిశు గృహం, బాల సదనాన్ని సోమవారం జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ గృహాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించి, పిల్లల వసతి, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై సవివరంగా ఆరా తీశారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి ఆరోగ్య పరిస్థితులు, విద్యా అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆడ పిల్లలపై మరింత శ్రద్ధ చూపాలని, సమయానుసారంగా పౌష్టికాహారం అందించాలన్నారు.
రూ.89 లక్షలతో వంతెనకు ప్రతిపాదనలు
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట దబ్బపాడు గ్రామం నుంచి సరుబుజ్జిలి మండలం పాతపాడు, తెలికపెంట మీదుగా జలుమూరు మండలం కొమనాపల్లి వెళ్లే రహదారిలో దబ్బపాడు వద్ద కనపలవానిగెడ్డపై రూ.89 లక్షలతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టు ఆర్‌అండ్‌బీ డీఈ సాగర్ తెలిపారు. ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, జలుమూరు మండలాలను కలుపుతూ ఉన్న రహదారి ఇది. ఇటీవల వర్షాలకు రహదారి కల్వర్టు పూర్తిగా దెబ్బతింది. దీంతో డీఈ సోమవారం పరిశీలించారు. వా హన రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటుచేయాలని సిబ్బందికి సూచించారు.
బలవంతపు భూసేకరణకు
వ్యతిరేకంగా బహిరంగ సభ రేపు
పలాస: మందస మండలం గంగువాడ గ్రా మంలో కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పది గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావులు సోమవారం తెలిపారు. అలాగే 9న బూర్జ మండలం మసానపుట్టిలో బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా బహిరంగ సభ ఉందని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్‌దొర, ఎస్.సింహాచలం తెలిపారు. ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి నంద్యాల జిల్లా వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నామని పేర్కొ న్నారు.
సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం
అరసవల్లి: విజయవాడలో ఏపీ పీహెచ్‌సీ వైద్యుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన మూడో రోజు నిరసనలో జిల్లాకు చెందిన పీహెచ్‌సీ వైద్యులు సోమవారం పాల్గొన్నారు. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించిన వైద్యుల సమస్యలపై సర్కార్ ప్రత్యేకంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై స్పందించి హక్కుల పత్రాలపై ఆమోదం లభించేవరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశా రు. కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు డాక్టర్ సుధీర్, ప్రతిష్టాశర్మ, సుమప్రియ, పావని, నవీన్, సాహితి, నాగేంద్ర, శ్రీనాథ్, మౌనిక, రమ్య, తేజ, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

అనకాపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి