
రైతన్నా.. జాగ్రత్తన్నా..!
● పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు అవసరం
● నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం
అపూర్వ సహకారం
పోలాకి: మండలంలోని కోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002–03 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు శభాష్ అనిపించుకున్నారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సాయం అందజేసి గొప్ప మనస్సు చాటుకున్నారు. దసరా సెలవులు పురస్కరించుకొని నాటి విద్యార్థులంతా సోమవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో భాగంగా అప్పటి గురువులను సత్కరించి తాము చదువుకున్న పాఠశాలలో భోజన శాల నిర్మించేందుకు రూ.2 లక్షల విరాళాన్ని హెచ్‌ఎం జి.శాంతికి అందజేశారు. దీంతో పూర్వ విద్యార్థులకు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
జలుమూరు: ప్రసుత్త ఖరీఫ్ సీజన్‌లో వరి పైరుకి ఆశించే తెగుళ్లు, చీడపీడల నివారణలో రైతన్నల బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో పంటకు ఆశించే తెగుళ్ల నివారణే లక్ష్యంగా రైతులు పంట పొలాలకు యథేచ్ఛగా క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. కానీ పిచికారీ చేసే సమయంలో భద్రతా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే ప్రమాదంతో పాటు ప్రాణహాని సంభవించే అవకాశాలు కూడా ఉంటాయని మండల వ్యవసాయాధికారి కింజరాపు రవికుమార్ హెచ్చరించారు. ఈ మేరకు జాగ్రత్త చర్యలను తెలియజేశారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● మందు పిచికారీకి పరిశుభ్రమైన నీరు వినియోగించాలి. ● పిచికారీ చేసే ముందు నోరు, ముక్కు, కళ్లకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలి.
● తలకు టోపీ ధరించి, ముఖానికి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. ● పురుగు మందులతో వచ్చిన సీసాలు, సంచులు ఇతర అవసరాలకు ఎట్టిపరిపరిస్థితిల్లోనూ వాడకూడదు. ● డబ్బాపై ఉన్న లేబుళ్లలో చూపినవిధంగా మందులు కలుపుకోవాలి. ● పురుగు మందులు కలిపినా, పిచికారీ చేసినా కళ్లజోడు ధరించాలి లేదంటే వాటి తుంపర్లు కళ్లలోకి వెళ్లే ప్రమాదముంది. ● ద్రావణాన్ని స్ప్రేయర్లలో పోసే ముందు, పొలాల్లో పిచికారి చేసే ముందు బీడి, చుట్ట, సిగిరెట్, ఖైనీ, గుట్కా, పాన్ మసాల వంటివి వినియోగించకూడదు.
● పురుగు మందుల డబ్బాను వాసన చూడకూడదు.
● భోజనానికి ముందు సబ్బుతో కాళ్లు, చేతులు కడుక్కోవాలి. ● పంటపై పిచికారీ చేసే సమయంలో స్ప్రేయర్ నాజల్ సక్రమంగా ఉందో లేదో చూసుకోవాలి. ● గాలి, ఎండ ఎక్కువగా ఉన్నప్పడు మందు ద్రావణాన్ని పిచికారీ చేయకూడదు.
● గాలికి వ్యతిరేక దిశలో కాకుండా వాలుగా ఉన్నప్పడు ద్రావణాన్ని పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటపై అక్క డక్కడ చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతు భరోసా కేంద్రాలు ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అలాగే గోడ పత్రికలు కూడా రైతు సేవా కేంద్రాలకు అతికించాము.
– కె.రవికుమార్, వ్యవసాయ అధికారి,
జలుమూరు

రైతన్నా.. జాగ్రత్తన్నా..!

రైతన్నా.. జాగ్రత్తన్నా..!