
7న పోరుబాట
శ్రీకాకుళం: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 7న నిర్వహించనున్న పోరుబాట ధర్నా విజయవంతం చేయాలని పలు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఎన్జీవో హోంలో ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బోధన, బోధనేతర, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలు ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి విజయవాడలో జరిగే ధర్నాకు తరలివచ్చేలా చొరవ తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పడి 14 నెలలు కావస్తున్నా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పారు. సమావేశంలో ఫ్యాప్టో కార్యదర్శి ప్రతాప్, ఏపీటీఎఫ్ నాయకుడు వెంకటేశ్వర్లు, నాయకులు గరుగుబిల్లి రమణ, శీర రమేష్‌బాబు, రామ్మోహన్ పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం