
చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతం చేయాలి
శ్రీకాకుళం: చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సమావేశం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్‌లో గొంటి గిరిధర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులలో శాసీ్త్రయ దృక్పథం, తార్కిక హేతుబద్ధ ఆలోచనలు, సృజనలను ప్రోత్సహించే జనవిజ్ఞాన వేదిక చెకుముకి సైన్సు సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం జిల్లా హెడ్మాస్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎర్నాగుల వాసుదేవరావు, ఫిజికల్ సైన్‌న్స్ టీచర్స్ ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎస్.సాయి శ్రీనివాస శర్మ, ఏపీ జీవశాస్త్ర ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి గోవిందరావు, ఏపీ మ్యాథ్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కందుల అశోక్, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి పైల రవికుమార్, మండల విద్యాశాఖ అధికారి సంఘ నాయకులు కె.ఎ.రాములు, డాక్టర్ వైష్ణవిలను సన్మానించారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొడ్డేపల్లి మోహనరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పి.కూర్మారావు, జిల్లా నాయకులు హనుమంతు మన్మధరావు, ఆర్.సురేష్‌బాబు, పి.వేదవతి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి, రాష్ట్ర కౌన్సిలర్ పొందూరు అప్పారావు, జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎస్.స్వర్ణకుమారి, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు పి.జగదీశ్వరరావు, సీహెచ్ రాజు, ఆర్.స్వప్న, ఎస్.సులోచన రాణి, కె.తుషార కన్య, సీహెచ్ సుబ్బలక్ష్మి, జి.కృష్ణవేణి, యూ.గిరిబాబు, పి.సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు.