
ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కృషి
శ్రీకాకుళం రూరల్: ప్రతి ఆటోడ్రైవర్‌ను ఆదుకుంటామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం ఎన్‌టీఆర్ మున్సిపల్ గ్రౌండ్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోడ్రైవర్లు సేవలో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 13887 మంది ఆటో సోదరులకు రూ.20 కోట్ల 83 లక్షల నగదును అందించామన్నారు. కలెక్టర్ స్పప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఆటో, మ్యాక్సీ, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామన్నారు. అనంతరం ఎంపీ ఆటో నడిపి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీటీసీ ఎ.విజయసారధి, మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు, ఆర్టీవో ఇన్‌స్పెక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.