
●దహన కాండ
పది తలలు.. 55 అడుగుల పొడవు.. 47 అడుగుల వెడల్పు.. అంతటి దశకంఠుడి విగ్రహం శ్రీరామ నామస్మరణ సాక్షిగా కాలి బూడిదైంది. జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి రావణ దహనం నిర్వహించారు. దాదాపు అరగంట పాటు బాణసంచా వెలుగుల్లో మైదానం దేదీప్యమానంగా వెలిగింది. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్‌డీఓ, తదితర అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
– శ్రీకాకుళం కల్చరల్

●దహన కాండ

●దహన కాండ