
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లావాసులకు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో జిల్లాకు చెందిన నలుగురికి అవకాశం కల్పిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్రపార్టీ కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా టెక్కలి నియోజకవర్గానికి చెందిన దివ్వాల పొలయ్య, ఆర్టీఐ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా ఆమదాలవలస ని యోజకవర్గం నుంచి బద్రి రామారావు, ఆర్టీఐ వింగ్ రాష్ట్ర సంయుక్తకార్యదర్శులుగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి మీసాల వెంకటరమణ, టెక్కలి నియోజకవర్గం నుంచి అక్కురాడ లోకనాథంలను నియమించారు.
సోంపేట: కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. సోంపేట పట్టణంలో సీఐటీయూ జిల్లా మహాసభలు శనివారం ప్రారంభించారు. సీనియర్ నాయకులు కె.సూరయ్య సీఐటీయూ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరులైన ఉద్యమ నాయ కులు సీతారాం ఏచూరి, వీజీకే మూర్తి, కొల్లి సత్యనారాయణ, ఎంవీ సత్యనారాయణ దొరల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 8 గంటల పనివేళలను 13 గంటలు చేస్తూ తీసుకువచ్చిన నూతన చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే నిరసనలు తప్పవన్నారు. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వాలు ఎకరా 99 పైసలు చొప్పున ధారాదత్తం చేయ డం దారుణమన్నారు. శని, ఆదివారాలు రెండు రోజులు మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. మహాసభల్లో జిల్లా ప్రధాన కార్యద ర్శి పి.తేజేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కేఎస్‌వీ కుమార్, పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందరావు, జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు, ఉపాధ్యక్షుడు నాగమణి, కార్యదర్శులు సంగారు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హిరమండలం: మండలంలో వంశధార వరదకు నీట మునిగిన పొలాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు శనివారం పరిశీలించారు. మండలంలోని జిల్లోడిపేటలో నీట మునిగిన పంటపొలాలు, తుంగతంపర గ్రామ సమీపంలో కోతకు గురైన కరకట్టను ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలసి పరిశీలించారు. నష్టంపై నివేదికలు వచ్చాక పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిష్టాత్మక ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు అంపైర్‌గా జిల్లాకు చెందిన సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ సంపతిరావు సూరిబాబు నియామకమయ్యా రు. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రా నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. 97 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్న ఈ మెగా టోర్నమెంట్ పోటీలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వనుంది. అస్సోం రాష్ట్రంలోని గౌహతి వేదికగా ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీలకు అంపైర్‌గా సూరిబాబు వ్యవహరించనున్నారు. ఈయన చిలకపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీగా పనిచేస్తూ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీఈఓ గా, పీఈటీ సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన నియామకంపై బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఆర్.రాజేంద్రన్, అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.సాగర్, ఎం.అశోక్‌కుమార్, చిలకపాలెం స్కూల్ హెచ్ ఎం చౌదరి లీలావతికుమారి, డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, ప్రసాద్, అనిల్, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లావాసులకు