
పగలు వ్యాపారం.. రాత్రి దొంగతనం
వజ్రపుకొత్తూరు రూరల్ : పగటి పూట ద్విచక్రవాహనంపై గ్రామాల్లో తిరుగుతూ వంట సామగ్రి వ్యాపారం చేస్తూ.. రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడు ఎట్టకేలకు గ్రామస్తుల చేతికి చిక్కాడు. గురువారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి వద్ద కొండమహంకాళీ అమ్మవారి గుడి వద్ద చోరీకి ప్రయత్నిస్తూ ఓ యువకుడు స్థానికులకు పట్టుబడ్డాడు. గ్రామస్తులు ప్రశ్నించగా దొంగతనానికి వచ్చిన ట్లు అంగీకరించాడు. మందస మండలంలోనూ పలు ఆలయాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. యువకుడి వద్ద ఉన్న ద్విచక్రవాహనం, దొంగతనాన్ని వినియోగించే పనిముట్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని శుక్రవారం పోలీసులకు అప్పగించారు. ఆధార్‌కార్డు ప్రకారం నరసన్నపేటకు చెందిన కల్లూరి ప్రభదాసుగా స్థానికులు చెబుతున్నారు.