
కేజీబీవీలో అర్ధరాత్రి అలజడి
● రెండంతస్తుల భవనంపై నుంచి పడి గాయపడిన విద్యార్థి ● లోలుగు కేజీబీవీలో ఘటన
పొందూరు: అర్ధరాత్రి సమయం.. విద్యార్థులంతా ఆదమరిచి నిద్రపోతున్న వేళ.. అంతా ఉలిక్కిపడేలా పెద్ద శబ్దం.. వచ్చి చూస్తే ఓ విద్యార్థిని రక్తమోడుతూ కనిపించింది. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్తే విద్యార్థిని రెండు కాళ్లు విరిగిపో యాయి. వెన్నెముకకు తీవ్రమైన గాయమైంది. పొందూరు మండలం లోలుగు కేజీబీవీలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే..
కేజీబీవీ పాఠశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సీహెచ్ వందన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రెండతస్తుల భవనంపై నుంచి పడిపోయింది. పెద్ద శబ్దం కావడంతో సిబ్బంది, విద్యార్థులు లేచి చూసేసరికి తీవ్రంగా గాయాలపాలై కింద పడిపోయి ఉన్న విద్యార్థిని కనిపించింది. వెంటనే విధుల్లో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయురాలు రూపవతి, అకౌంటెంట్ నాంచారమ్మలు ప్రిన్సిపాల్ ఎస్.లలితకుమారికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో అందులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విద్యార్థిని కాళ్లు రెండూ విరిగిపోవడంతో పాటు వెన్నుపూస కూడా గాయమైనట్లు సమాచారం. ఘటనపై ఎస్‌ఐ సత్యనారాయణ ఉపాధ్యా యినులు, సిబ్బంది, విద్యార్థినులతో మాట్లాడా రు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు పొందూరు ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశా రు. కొన్ని రోజులుగా స్థానిక కేజీబీవీ అనేక విషయాల్లో వివాదాస్పదమవుతుండడంతో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయినులు, సిబ్బంది, విద్యార్థినులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఎంఈఓ–1 వాగ్దేవికి సమాచా రం ఇవ్వడంతో ఆమె శ్రీకాకుళం రిమ్స్‌కు వెళ్లి వివరాలు సేకరించారు.
పొందూరు: మండలానికి చెందిన రచయిత, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార అవార్డు గ్రహీత వావిలపల్లి రాజారావుకు అరుదైన గౌరవం దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న భక్తి సందేశం కార్యక్రమంలో ప్రసంగించేందుకు టీటీడీ ఆహ్వానం పంపింది. ఈ నెల 30వ తేదీన తిరుమలలోని ఆస్థాన మండపంలో అన్నమయ్య కీర్తనలపై ప్రసంగం ఉంటుంది.

కేజీబీవీలో అర్ధరాత్రి అలజడి