
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల నియామకం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురిని నియమిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటన విడుదల చేశా రు. రాష్ట్ర మున్సిపల్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పలాస నియోజకవర్గానికి చెందిన బడగల బాలచంద్రుడు, దివ్యాంగుల విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నరసన్నపేట నియోజకవ ర్గం నుంచి బాన్న రాము, వైఎస్సార్ టీయూసీ సంయుక్త కార్యదర్శిగా నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన కొబగాపు నాగరాజు, సోషల్‌మీడియా వింగ్ సంయుక్త కార్యదర్శులుగా ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన బొడ్డేపల్లి వెంకటసత్యం, నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన కనపల అరవింద్‌నాయుడుని నియమించారు.
కొత్తూరు: వసప గ్రామం వద్ద ఉన్న కేజీబీవీలో అదనంగా ఉన్న 1150 కిలోల బియ్యంను స్థానిక తహసీల్దార్ కె.బాలకృష్ణ శనివారం సీజ్ చేశారు. కేజీబీవీని తహసీల్దార్ శనివారం తని ఖీ చేశారు. కేజీబీవీ ఎస్‌ఓ రాధిక అందించిన రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పుస్తకాలను నిశితంగా పరిశీలించారు. రికార్డుల ప్రకా రం 248 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా.. అదనంగా మరో 1150 కిలోల బియ్యం ఉన్నట్లు తహసీల్దార్ గుర్తించారు. వీటిని సంచులు కప్పి గోప్యంగా ఉంచారు. సీజ్ చేసిన బియ్యంలో 300 కిలోలు బియ్యం హాస్టల్‌కు వెనుక భాగంలో ప్రహరీకి, హాస్టల్‌కు మధ్యన ఉండడం గమనార్హం. ఈ బియ్యం పూర్తిగా తడిసి పాడైపోయిందని తహసీల్దార్ తెలిపారు. అదనపు బియ్యంపై సమగ్ర సర్వ శిక్ష అభియాన్ ఏపీసీకి నివేదిక అందించామన్నారు. కేజీబీవీ ఎస్‌ఓపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయి.

వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల నియామకం