
● అయిన వారికే యూరియా!
ఇచ్ఛాపురం రూరల్: యూరియా అధికార పార్టీ వారికి, వారికి అయిన వారికి మాత్రమే దక్కుతోందని కొళిగాం, కీర్తిపురం, పాయితారి, బొడ్డబడ పంచాయతీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత వచ్చిన యూరియాను శుక్రవారం కొళిగాం రైతు సేవా కేంద్రంలో పంపిణీ చేస్తుండటంతో వందలాది మంది రైతులు అక్కడకు చేరుకున్నారు. అయితే గతంలో యూరియాను తీసుకువెళ్లిన వారే మళ్లీ పేర్లు మార్చి తీసుకువెళ్తున్నారని, కూటమి నాయకులు ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.