
ప్రభుత్వం మెడలు వంచే వరకు
నిధులు లేవుగా..రాష్ట్ర పండుగకు నిధులు లేవు. కోటమ్మ తల్లి ఉత్సవాల తీరు ఇది. –IIలో
● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
● వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగం ‘చలో మెడికల్ కాలేజీ’ లో పాల్గొన్న జిల్లా నాయకులు
సాక్షి, పార్వతీపురం మన్యం:
రాష్ట్రంలోని 17 వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అధ్యక్షతన పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోటెత్తాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కదం తొక్కాయి. పేదలకు వైద్య విద్యను దూరం చేసే సర్కారు కుటిలత్వాన్ని కడిగి పారేశాయి. జిల్లా నుంచి కూడా నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ..
పార్వతీపురం వైద్యకళాశాలకు అనుబంధంగా ఇక్కడి జిల్లా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశారని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇదంతా ప్రజలకు చెందాల్సిన ఆస్తి అని, పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో మూడు ఎస్టీ, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవేనని తెలిపారు. అంతా పేద గిరిజన, దళిత వర్గానికి చెందిన వారేనని, వీరందరికీ కష్టం వస్తే ఎక్కడో ఉన్న కేజీహెచ్‌కు వెళ్లాల్సిందేనని చెప్పారు. వీరికి మంచి చేయాలని జగన్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకొస్తే.. అది కూడా కబ్జాచేసి, ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సిద్ధమైన దుర్మా ర్గ ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. ఇక్కడున్న గిరిజన శాఖా మంత్రికి ఇది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను చూస్తే జాలేస్తోందన్నారు. జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదని అంటున్నారని, పార్వతీపురం మెడికల్ కాలేజీకి వచ్చి జీఓలు చూడాలని సూచించారు. మంత్రి పదవులు కాపాడుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, మంత్రులను చంద్రబాబు బ్లాక్‌మెయిల్ చేసి, వైఎస్సార్‌సీపీపై విమర్శలకు దిగాలని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మెడలు వంచే వరకూ మెడికల్ కళాశాల పరిరక్షణ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం మెడలు వంచే వరకు

ప్రభుత్వం మెడలు వంచే వరకు