
ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతుంది
● మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడం చీకటి అధ్యాయం
● మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆమదాలవలస: పేదవాడికి వైద్య విద్యను దూరం చేయడం ప్రభుత్వానికి తగదని, పేదల ఉసురు చంద్రబాబు ప్రభుత్వానికి తగలక మానదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పార్వతీపురంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి జిల్లా యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శ్రీ కాకుళం జిల్లా నుంచి పెద్ద ఎత్తున బయల్దేరారు. నేతలంతా ఒకచోట చేరిన సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నేతలు మాట్లాడారు. మాజీ స్పీకర్ తమ్మి నేని సీతారాం మాట్లాడుతూ పేదల పొట్టకొట్టడం చంద్రబాబునాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. ఆదాయ అన్వేషణలో విద్య, వైద్యాన్ని కూడా ప్రైవేటుకు తాకట్టు పెట్టడం సమంజసం కాదన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పేదలకు అండగా వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు ఉంటారని తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడు తూ చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముడుపోయారని విమర్శించారు. అందుకే అన్ని రంగాలను ప్రైవేటుపరం చేసేందుకు పావులు కదుపుతున్నారని పేర్కొన్నారు. అంతకుముందు ఆమదాలవలస పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి డౌన్‌లోగల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ మన్యం జిల్లా(పార్వతీపురం)మెడికల్ కళాశాలను సందర్శించారు.
మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర కళింగ కుల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)దుంపల లక్ష్మణరావు, తూర్పు కాపు విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర వెలమ విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర యువజన విభా గం అధ్యక్షుడు మెంటాడ స్వరూప్, రాష్ట్ర కార్యదర్శి సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బొడ్డేపల్లి రమేష్‌కుమార్, గుమ్మడి రాంబాబు, ఇంటలెక్చువల్ ఫామ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల రామకృష్ణ, ధర్మాన రామ్ మనోహ ర్ నాయుడు, కోట గోవిందరావు, జిల్లా యువజన అధ్యక్షుడు మార్పు పృథ్వీ, ముత్తాడ విజయ్ కుమా ర్, జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు, ముఖ్యనాయకులు పిన్నింటి సాయి కుమార్, గేదెల పురుషోత్తం, రౌతు శంకర రావు, సీపాన రామారా వు, బొడ్డేపల్లి నారాయణరావు, దుంపల శ్యామలరావు, టోంపల సీతారాం, రామకృష్ణ, కూన రామ కృష్ణ, సిస్టు గోపి, చిన్ని జోగారావు, కామేశ్వరి, మామిడి కిరణ్, అత్తులూరి రవికాంత్, బొడ్డేపల్లి నారాయణరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరావు, మామిడి కిరణ్, పొన్నాడ చిన్నారావు, చిన్ని జోగారావు, తంగి అప్పన్న తోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.