
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
జలుమూరు: తిలారు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందినట్లు జీఆర్‌పీ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 70 ఏళ్లు ఉంటుందని, మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని చెప్పారు. వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీస్‌లకు సమాచారం తెలియజేయాలని కోరారు.
రైలుపట్టాలపై మృతదేహం
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు రైల్వేపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతుడు కాలికి కట్టు కట్టి ఉందని, నీలం షర్ట్, పంచె ధరించాడని చెప్పారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 9492250069 నంబర్‌కు తెలియజేయాలని పలాస జీఆర్‌పీ హెచ్‌సీ ఎం.సోమేశ్వరరావు తెలిపారు.